లేటెస్ట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న అవైటెడ్ చిత్రమే “ఓజి”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ పై కన్నేసింది. ఇలా డే 1 కే సాలిడ్ టాక్ రావడంతో మేకర్స్ కూడా సక్సెస్ ప్రెస్ మీట్ లాంటిది పెట్టారు.
అయితే ఈ సినిమాలో చూసిన తర్వాత సుజీత్, ప్రభాస్ ల సాహో కి ఇపుడు పవన్ ఓజి చిత్రానికి లింక్ పెట్టడంతో కేజ్రీగా మారింది. ఇలా సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ ని పరిచయం చేయడం జరిగింది. ఇక లేటెస్ట్ గా రెండు ప్రపంచాల కలయికపై తాను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
తనకి ప్రభాస్ అన్న, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లోజ్ అని తనకి సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధించి కొన్ని ఐడియాలు అయితే ఉన్నాయని కానీ పూర్తిగా వాటిపై దృష్టి పెట్టలేదని తాను తెలిపాడు. అయితే ఇపుడు కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఉన్నారు సో ఇది ఎలా ముందు వెళుతుందో తనకి కూడా తెలీదు అన్నట్టు తెలిపాడు. తాను తన సినిమాటిక్ యూనివర్స్ పట్ల ఎలా ప్లానింగ్ లో ఉన్నాడు అనేది తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి.