‘ఓజి’ ప్రీమియర్స్ తో ఆల్ టైం రికార్డ్!

‘ఓజి’ ప్రీమియర్స్ తో ఆల్ టైం రికార్డ్!

Published on Sep 25, 2025 5:00 PM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా నే ఓజి. భారీ హైప్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో భారీ ఎత్తున పైడ్ ప్రీమియర్స్ తో విడుదల అయ్యింది. మరి ఈ పైడ్ ప్రీమియర్స్ తోనే ఓజి రికార్డ్ సెట్ చేసినట్టు తెలుస్తోంది.

మొత్తం 20 కోట్లకు పైగా షేర్ ని ఓజి రాబట్టి ఆల్ టైం రికార్డ్ సెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో 10 కోట్ల ఒక్క నైజాం నుంచే వచ్చాయట. దీనితో ఇది వరకు ఏ సినిమా కూడా కొట్టని భారీ వసూళ్లు ఓజి రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు అలాగే డివివి దానయ్య నిర్మాణం వహించారు.

తాజా వార్తలు