లేటెస్ట్: మాంచి ఎనర్జీతో రెబల్ స్టార్.. రాజా సాబ్ నుంచి సాంగ్ కి డేట్ ఫిక్స్!

లేటెస్ట్: మాంచి ఎనర్జీతో రెబల్ స్టార్.. రాజా సాబ్ నుంచి సాంగ్ కి డేట్ ఫిక్స్!

Published on Nov 21, 2025 12:10 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న అవైటెడ్ చిత్రం ది రాజా సాబ్ కూడా ఒకటి. కాగా ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ ముందుగా ఫస్ట్ సాంగ్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్నారు. మరి దీనికి ఫైనల్ గా సాలిడ్ అప్డేట్ మేకర్స్ నుంచి వచ్చేసింది. ఇన్ని రోజులు వెయిట్ చేసిన డార్లింగ్ ఫ్యాన్స్ కి ప్రభాస్ నుంచి మంచి ఎనర్జిటిక్ సాంగ్ పోస్టర్ తో ఫీస్ట్ ని ప్రామిస్ చేస్తున్నారు.

మంచి కలర్ ఫుల్ గా కనిపిస్తున్న ఈ పోస్టర్ లో ప్రభాస్ స్టెప్ తో స్క్రీన్స్ షేక్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇక ఈ మొదటి సాంగ్ ని ఈ నవంబర్ 23న విడుదల చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. మరి థమన్ ఎలాంటి బీట్స్ దీనికి అందించాడో చూడాల్సిందే. మరి ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించగా రానున్న జనవరి 9న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

తాజా వార్తలు