‘అఖండ 2’ ట్రైలర్.. థమన్ బ్లాస్టింగ్ అప్డేట్!

‘అఖండ 2’ ట్రైలర్.. థమన్ బ్లాస్టింగ్ అప్డేట్!

Published on Nov 21, 2025 9:00 AM IST

Akhanda 2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “అఖండ 2”. భారీ అంచనాలు నడుమ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టేందుకు రాబోతుంది. ఇక దీనికి ముందు అంతా ట్రైలర్ బ్లాస్ట్ కోసమే ఎదురు చూస్తుండగా ఈ ట్రైలర్ పై సంగీత దర్శకుడు థమన్ బ్లాస్టింగ్ అప్డేట్ అందించాడు.

ట్రైలర్ కి ఇప్పుడే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూర్తయ్యింది అని ఇది బ్లాస్ట్ అంతే అంటూ ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ అందించాడు. దీనితో ఇక ఈ ట్రైలర్ కోసం అభిమానులు మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ నేడు నవంబర్ 21 సాయంత్రం రిలీజ్ కానుంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో హర్షాలీ మల్హోత్రా ముఖ్య పాత్రలో నటించగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ డిసెంబర్ 5న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి రానుంది.

తాజా వార్తలు