అక్కడ రికార్డుల పాతరకు సిద్ధమవుతున్న ‘రాజాసాబ్’

The-Raja-Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాజాసాబ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు.

రాజాసాబ్ కోసం ఇండియన్ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో, ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా అంతే ఆసక్తిగా చూస్తున్నారు. ఇక వారి కోసం ఈ సినిమాను జనవరి 8, 2026న స్పెషల్ ప్రీమియర్స్‌తో రిలీజ్ చేయబోతున్నామని.. దానికి సంబంధించిన టికెట్ బుకింగ్స్‌ను నార్త్ అమెరికాలో డిసెంబర్ 4 నుంచి ప్రారంభం చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.

ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌తో పాటు ఓవర్సీస్ బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Exit mobile version