ఇలా లాంగ్ గ్యాప్ రావడం భాదే – వేణు

ఇలా లాంగ్ గ్యాప్ రావడం భాదే – వేణు

Published on May 13, 2013 12:30 PM IST

venu-thottempudi

‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’ లాంటి హిట్ సినిమాలలో నటించిన హీరో తొట్టెంపూడి వేణు చాలా రోజుల తరువాత మళ్ళీ ‘రామాచారి’ సినిమాతో స్క్రీన్ పై కనిపించనున్నాడు. ఈ సినిమా విజయం సాదిస్తుందని వేణు చాలా నమ్మకంగా వున్నాడు. ఈ సినిమా పిల్లలకు పెద్దలకు అందరికి నచ్చుతుందని వేణు అంటున్నాడు. ఈ రోజు సాక్షి దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వేణు తన కెరీర్ గురించి, ఈ లాంగ్ గ్యాప్ గురించి మాట్లాడుతూ ‘ కారణాలు ఏమైనా కావచ్చు. ఇలా లాంగ్ గ్యాప్ రావడం భాదే. నేను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. నాకు ఎటువంటి ఫ్యామిలీ బ్యాగ్ గ్రౌండ్ లేదు. ఈ లాంగ్ గ్యాప్ లో నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ గా వున్నారు. ‘రామాచారి’ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుంది. ఈ సినిమా నా కెరీర్ లో నేను ఎదగడానికి సహాయ పడుతుందని అనుకుంటున్నాను. ఇప్పటి నుండి సంవత్సరానికి 2 – 3 సినిమాలు తీయాలనుకుంటూన్నాను’ అని అన్నాడు. తన తరువాత సినిమాకి ప్రముఖ రచయిత అబ్బూరి రవి కథని రాస్తున్నారని తెలియజేశాడు.

తాజా వార్తలు