ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూలై 04, 2025
స్ట్రీమింగ్ వేదిక : సోనీ లివ్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : అమిత్ సియాల్, సాహిల్ వైద్, బక్స్, డానిష్ ఇక్బాల్, విద్యుత్ గార్గి, షఫీక్ ముస్తఫా, గౌరీ పద్మకుమార్, అంజనా బాలాజీ, సాయి దినేష్
దర్శకత్వం : నగేష్ కుకునూర్
నిర్మాతలు : సమీర్ నాయర్, దీపక్ సెగల్, ఎలాహె హిప్టూలా, నగేష్ కుకునూర్
సినిమాటోగ్రఫీ : సంగ్రామ్ గిరి
సంగీతం : తపస్ రెలియా
ఎడిటర్ : ఫరూక్ హుందేకర్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
రీసెంట్ గా ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ కంటెంట్ లో సోనీ లివ్ తీసుకొచ్చిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ “ది హంట్-రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్” కూడా ఒకటి. దేశ దివంగత ప్రధాని రాజీయేవ్ గాంధీ హత్య కేసుపై తెరకెక్కించిన ఈ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
అది 1991 సంవత్సరం మే 21న రాత్రి ఓ పొలిటికల్ మీటింగ్ నిమిత్తం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ తమిళనాడుకి చెందిన శ్రీపెరంబదూర్ గ్రామంలో హాజరైన సమయంలో అక్కడ మానవబాంబుతో ఆయన్ని హతమార్చాక ఈ కేసు దేశ భద్రతా దళానికి సవాలుగా మారుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దీని వెనుక ఉన్నది ఎవరు అనేది కనిపెట్టి తీరాలి. ఇందులో భాగంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ని నియమిస్తే దానికి హెడ్ గా హైదరాబాద్ కి చెందిన స్పెషల్ ఆఫీసర్ డా కార్తికేయన్ ఐజీపీ (అమిత్ సియల్) నియమించబడతారు. ఇక్కడ నుంచి తన టీం అమోద్ కాంత్ (దానిశ్ ఇక్బాల్), రాధా వినోద్ రాజు (గిరీష్ శర్మ), అమిత్ వర్మ ( షాహిల్ వైడ్) డిఎస్పీ రఘోత్తమన్ లతో మొదలు పెడతారు. ఇందులో శ్రీలంకన్ తమిళన్ అలాగే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE) లో కీలక లీడర్ శివరాసన్ (షఫీక్ ముస్తఫా)ని ప్రధాన నిందితునిగా ఉంటాడు. మొత్తం ప్లాన్ ని చేసిన శివరాసన్ ని సిట్ అధికారులు పట్టుకున్నారా? లేదా? మొత్తం 90 రోజులు పాటుగా సాగిన ఇన్వెస్టిగేషన్ లో చివరికి ఎవరు గెలిచారు? అనేది తెలియాలి అంటే ఈ సిరీస్ చూడాలి.
ప్లస్ పాయింట్స్:
డెఫినెట్ గా మేకర్స్ నుంచి ఇది ఒక హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పి తీరాలి. మేకర్స్ ప్రతీ చిన్న డీటెయిల్ ని చూపించే ప్రయత్నం చేశారు. రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తిని పక్కాగా పన్నాగం వేసి చంపడం అందుకు చేసిన హోమ్ వర్క్ ఏంటి? ఈ అంతటి వెనుక ఉన్నది ఎవరు? వారిని పట్టుకునే క్రమంలో సిట్ అధికారులకి ఎదురైనా సవాళ్లు ఏంటి అనే వాటిని నీట్ గా తీసుకెళ్లారు.
అలాగే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఇంకా నాలుగో ఎపిసోడ్ నుంచి కథనం మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఇది ఆరో ఎపిసోడ్ వరకు కొనసాగుతుంది. ఇంకా చివరి ఎపిసోడ్ కి కూడా మంచి మార్కులు ఇవ్వొచ్చు. తర్వాత ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అనే మూమెంటం ఆసక్తి కలిగిస్తుంది.
ఇక సిరీస్ లో నటీనటులు అంతా కూడా సాలిడ్ పెర్ఫామెన్స్ లని అందించారు. దానిశ్ ఇక్బాల్, గిరీష్ శర్మ, షాహిల్ వైడ్ లు సిన్సియర్ ఆఫీసర్స్ గా కనిపించారు. అలాగే రాజీవ్ గాంధీ హత్యకి కారణమైన శివ రాసన్ నటుడు షఫీక్ ముస్తఫా తనలోని విలనిజాన్ని అద్భుతంగా చూపించారు. ఇంకా తన టీం నటీనటులు కూడా సహజమైన నటనతో ఆకట్టుకుంటారు.
మైనస్ పాయింట్స్:
ఈ సిరీస్ ఒక మంచి అటెంప్ట్ అయినప్పటికీ చూసే వీక్షకుల సహనాన్ని పరీక్షించక మానదు. కొన్ని చోట్ల ఓకే కానీ మిగతా కథనం అంతా అలా సాగుతూ కనిపిస్తుంది. కొన్ని ఎపిసోడ్స్ వరకు పర్వాలేదు కానీ మిగతా ఎపిసోడ్స్ మాత్రం నెమ్మదిగా అలా వెళుతూ ఉంటాయి.
అయితే ఇందులో కథనం ఈ డిమాండ్ చేసి ఉండొచ్చు కానీ దీనికి ఇంకొంచెం ఫాస్ట్ గా నడిపించి ఉండాల్సింది. అలాగే పాత్రలు ఒక దాని తర్వాత పరిచయం అవుతూనే ఉంటాయి ఇది ఆగదు. కొంత సమయం వరకు ఓకే కానీ వీటిని ఇంకా ఎక్కువ డీటైలింగ్ గా సాగదీతగా కొనసాగించడం మాత్రం సహనానికి పరీక్ష పెడుతుంది.
ఇక వీటితో పాటుగా సిరీస్ ముగింపు కూడా ఖచ్చితంగా అందరికీ రుచించకపోవచ్చు. అప్పటివరకు ప్రభుత్వం పెట్టిన ఎఫర్ట్స్ వేస్ట్ కావడంతో ఇది వాస్తవ సంగటనలు ఆధారంగా తెరకెక్కిందే అయినప్పటికీ ఈ ఘటన కోసం తెలియని వారు నిరాశ చెందుతారు.
అయితే ఇక్కడ చాలా ప్రశ్నలు మెదులుతాయి కానీ ఆ ప్రశ్నలని ప్రశ్నలు గానే మేకర్స్ వదిలేయడం కూడా డిజప్పాయింట్ చేస్తుంది. అప్పటివరకు తీసుకెళ్లిన కథనం అంతటికీ ఒక అర్ధం లేకుండా పోయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ హత్య వెనుక అసలు కారణం ఏంటి అనేది కూడా అసంపూర్ణంగా అనిపిస్తుంది. అలాగే నటీనటుల్లో ఇన్ సైడ్ ఎడ్జ్ ఫేమ్ టాలెంటెడ్ నటుడు కార్తికేయన్ పాత్ర నిరాశ పరుస్తుంది. తన పాత్రే మెయిన్ గా స్టార్ట్ అవుతుంది కానీ తనకి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది.
సాంకేతిక వర్గం:
ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నేపథ్యానికి తీసుకున్న సెటప్ గాని నటీనటుల ఎంపిక గాని చూసే వీక్షకులని ఆశ్చర్యపరుస్తుంది. సంగ్రామ్ గిరి ఇచ్చిన కెమెరా వర్క్ చాలా బాగుంది. అలాగే తపస్ రెలియా ఇచ్చిన స్కోర్ బాగానే ఉంది కానీ ఇంకొంచెం థ్రిల్లింగ్ మ్యానర్ లో ఉంటే బాగుంది. ఫరూక్ హుందేకర్ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. కథనం చాలా స్లోగా సాగదీతగా నడిపించారు. తెలుగు డబ్బింగ్ బిలో యావరేజ్ గా ఉంది.
ఇక దర్శకుడు నగేష్ కుకునూర్ విషయానికి వస్తే.. తాను మంచి థ్రిల్లర్ చాప్టర్ ని ఎంచుకున్నారు అలాగే ఇందులో ప్రతీ డీటెయిల్ ని ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ క్రమంలో కథనం మాత్రం అంత గ్రిప్పింగ్ గా కనిపించలేదు. ఈ విషయంలో తాను కొంచెం కేర్ తీసుకోవాల్సింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే “ది హంట్ – రాజీవ్ గాంధీ అసాసినేషన్” సిరీస్ ఒక హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. నటీనటులు అంతా సిన్సియర్ గా తమ పాత్రలు చేశారు. అలాగే దర్శకుడు కథనాన్ని తల్లివేరు నుంచి చెట్టు చిగురు మూలం వరకు తెరకెక్కించే ప్రయత్నం మాత్రం స్లోగా సాగుతుంది. వీటితో కొన్ని చోట్ల వరకు ఓకే కానీ మిగతా కథనం మాత్రం సహనాని పరీక్షిస్తుంది. అలాగే క్లైమాక్స్ ముగింపు కూడా అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఇవి పక్కన పెడితే దేశాన్ని కుదిపేసిన ఓ నిజమైన సంఘటన దాని వెనుక ఏం జరిగింది అనేవి తెలుసుకోవాలి అనుకునేవారు మాత్రం చాలా తక్కువ అంచనాలు ఎక్కువ ఓపికని పెట్టుకొని ట్రై చేస్తే మంచిది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team