ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఏప్రిల్ 11, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : జాన్ అబ్రహం, సదియా ఖతీజ్, రేవతి, జగ్జీత్ సందు, కుముద్ మిశ్ర తదితరులు.
దర్శకత్వం : శివం నైర్
నిర్మాతలు : టి-సిరీస్ ఫిల్మ్స్, జె ఎంటర్టైన్మెంట్, వాకావో ఫిల్మ్స్, ఫార్చ్యూన్ పిక్చర్స్
సంగీతం : ఇషాన్ ఛబ్రా, మనన్ భరద్వాజ్, అనురాగ్ సైకియా
సినిమాటోగ్రఫీ : డిమో పోపోవ్
ఎడిటింగ్ : కునాల్ వాల్వ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
లేటెస్ట్ గా ఓటిటిలోకి వచ్చిన చిత్రాల్లో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం నటించిన చిత్రం “ది డిప్లొమాట్” కూడా ఒకటి. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతుంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఈ చిత్రం 2017 సమయంలో బునెర్, కైబర్ పుత్తేన్కువ ప్రాంతంలో కొంతమంది పాకిస్తాన్ వ్యక్తుల దగ్గర ఉజ్మా అహ్మద్ (సదియా ఖతీబ్) ఇరుక్కుంటుంది. తనతో పాటుగా అక్కడ మరింతమంది అమ్మాయిలు కూడా ఉంటారు. అయితే ఆమెని తాహిర్ (జగ్జీత్ సందు) ని నమ్మి అక్కడికి వస్తే అతడేం చేసాడు? అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఉజ్మా వేసిన ప్లాన్ ఏంటి? ఈ అంతటిలో పాకిస్తాన్ లోని ఇండియన్ ఎంబెస్సీ కి చెందిన డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్ (జాన్ అబ్రహాం) సహా భారత ప్రభుత్వం ఏం చేశారు? చివరికి ఉజ్మా భారత్ కి తిరిగి వచ్చిందా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన సినిమాలు దాదాపు బాగానే ఉంటాయి. మరి వాటి తరహాలోనే ఈ ది డిప్లొమాట్ కూడా ఉందని చెప్పవచ్చు. మెయిన్ పాయింట్ కంటే ఇందులో కథనం చూసేందుకు ఆడియెన్స్ కి డీసెంట్ గా అనిపిస్తుంది. దర్శకుడు ప్లాన్ చేసుకున్న స్క్రీన్ ప్లే అక్కడక్కడా వచ్చే కొన్ని మైండ్ గేమ్ ఇంకా ట్విస్ట్ లు చూసేందుకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.
అలాగే పాకిస్తాన్ వరకు కొన్ని సన్నివేశాలు అయితే కొంచెం హార్డ్ హిట్టింగ్ కూడా అనిపించవచ్చు. అలాగే కథనం కూడా నెమ్మదిగా పికప్ అవుతూ మరింత ఇంట్రెస్టింగ్ గా మారడం ఈ సినిమాలో బాగుందని చెప్పొచ్చు. ఇంకా క్లైమాక్స్ కి వచ్చేసరికి కొన్ని దేశ భక్తి సన్నివేశాలు ఇండియన్ ఆడియెన్స్ ని ఎగ్జైట్ చేస్తాయి.
ఇక వీటితో పాటుగా ప్రధాన నటీనటులు మంచి నటన కనబరిచారు. మెయిన్ గా జాన్ అబ్రహం నుంచి ఇదొక సెటిల్డ్ పెర్ఫామెన్స్ కనిపించిన సినిమా. ఇది వరకు తనని మంచి యాక్షన్ రోల్స్ లో చూసినవారికి కొంచెం ఫ్రెష్ గా అనిపించవచ్చు.
అలాగే సదియా ఖతీబ్ తన రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. ఆమె లుక్స్ సహజమైన పెర్ఫామెన్స్ లు బాగున్నాయి. వీరితో పాటుగా తాహిర్ నటుడు జగ్జీత్ సందు తన రోల్ లో జీవించాడు. వీరితో పాటుగా ప్రముఖ నటి రేవతి కీలక పాత్రలో కనిపించారు. తన రోల్ లో ఆమె బాగా చేశారు. వీరితో పాటుగా నెగిటివ్ రోల్ లో అశ్వత్ భట్ ప్రభావం కనిపిస్తుంది. ఇంకా ఇతర ముఖ్య నటీనటులు బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రం కూడా ఇది వరకు మనం చూసిన పలు నిజ జీవిత సంఘటనలు సినిమాల తరహాలోనే ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ కొత్తదనం కోరుకునేవారికి గొప్పగా అనిపించకపోవచ్చు.
ది కాశ్మీర్ ఫైల్స్, కాఫిర్ వంటి ట్రీట్మెంట్ ఈ చిత్రంలో కనిపిస్తుంది కానీ వాటికీ దీనికి ఒక కొత్త కోణం సినిమాని సేవ్ చేసింది అని చెప్పొచ్చు. అలాగే ఫస్టాఫ్ లో కథనం కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత పికప్ అయ్యాక మళ్ళీ సెకండాఫ్ లో అక్కడక్కడా కథనం ఫ్లో మిస్ అయ్యినట్టుగా అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇండియా నుంచి పాకిస్తాన్ వరకు ఆ వాతావరణాన్ని మేకర్స్ అండ్ టీం క్రియేట్ చేసిన విధానం బాగుంది. ఇషాన్ చబ్రా స్కోర్ బాగుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో వాటి ప్రభావం కనిపిస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్స్ కూడా బాగానే ఉన్నాయి.
ఇక శివం నైర్ దర్శకత్వానికి వస్తే.. వాస్తవ సంఘటనలు ఆధారంగా ప్లాన్ చేసుకున్న ఈ స్క్రిప్ట్ ని తాను డీసెంట్ గా డీల్ చేసారని చెప్పొచ్చు. పలు చోట్ల స్క్రీన్ ప్లే మెప్పిస్తుంది. అయితే కొన్ని చోట్ల కథనం కొంచెం స్లోగా ఉంది కానీ తన వర్క్ ఈ సినిమాకి మెప్పించింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ‘ది డిప్లొమాట్’ ఓటిటి వీక్షకులకు ఓకే రేంజ్ ట్రీట్ ఇస్తుంది అని చెప్పొచ్చు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో కథనం ఒకింత మెప్పించే అంశం. కొన్ని చోట్ల రెగ్యులర్ గా అనిపించవచ్చు కానీ ఇందులో కోణం కొత్తది. సో నెట్ ఫ్లిక్స్ లో ఒకసారికి ఈ చిత్రాన్ని ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team