పుష్పలో బన్నీలోని ఆ యాంగిల్ మిస్..?

పుష్పలో బన్నీలోని ఆ యాంగిల్ మిస్..?

Published on Apr 19, 2020 8:34 PM IST


బన్నీ సుకుమార్ ల హ్యాట్రిక్ మూవీ పుష్ప పై అంచనాలు మాములుగా లేవు . ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్రకటించడంతో ఆ అంచనాలు మరో స్థాయికి చేరాయి. దానికి తోడు బన్నీ సుకుమార్ లది హిట్ కాంబినేషన్ కూడాను. దాదాపు 11ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయ్యింది. చివరిగా 2009లో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య 2 మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక బన్నీ పుట్టిన రోజు పురస్కరించుకొని పుష్ప ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రఫ్ అండ్ మాస్ రాయలసీమ మొరటోడు గెటప్ లో బన్నీ ఇరగదీశాడు.

కాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రచారం లోకి వచ్చింది. పుష్ప లో బన్నీ రోల్ చాలా సీరియస్ అట. ఆద్యంతం తీవ్రమైన ఇంటెన్సిటీతో ఆయన పాత్ర ఉంటుందట. బన్నీ గత చిత్రాలలో వలె కొంచెం కూడా కామెడీ యాంగిల్ కూడా ఆయన పాత్రలో ఉండదట. ఇది కూడా రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోందని తెలుస్తుండగా రష్మికతో రొమాంటిక్ సీన్స్ కూడా తక్కువ ఉండే అవకాశం కలదని టాక్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప చిత్రానికి సంగీతం దేవీశ్రీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు