చిన్న సినిమాలు బాగుపడాలంటే అదొక్కటే దారి !

సినీ కార్మికుల సమ్మె పరిస్థితి రోజురోజుకూ తీవ్రరూపం దాల్చేలా ఉంది. జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపించకపోగా.. సమ్మెను ఉధృతం చేస్తున్నాయి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. ఈ రోజు జరగనున్న చర్చల్లో సానుకూల ఫలితం రాకపోతే.. సినీ కార్మికులు సోమవారం ఫిలింఛాంబర్‌ను ముట్టడించే అవకాశం ఉంది. నిర్మాతలు పెట్టిన నాలుగు కండిషన్స్‌లో రెండింటికి ఓకే చెప్పారు సినీ కార్మికులు. అయితే, మిగిలిన రెండు కండిషన్లకు మాత్రం అంగీకరించేలా కనిపించడం లేదు.

ఆ రెండిట్లో ముఖ్యమైనది ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు కాల్షీట్. ఈ కాల్షీట్ ను యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం.. అదనంగా వచ్చే ఆదాయం పోతుందనే. ఇక నిర్మాతలు పెట్టిన మరో కండిషన్, ఆదివారం పేమెంట్స్. నెలలో రెండో ఆదివారంతో పాటు శెలవు దినాల్లో మాత్రమే డబుల్ పేమెంట్స్ ఇస్తామని నిర్మాతలు తెగేసి చెప్పారు. ఈ కండిషన్ ను కూడా యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు నాన్ యూనియన్ల మెంబర్స్ ను కూడా పెట్టుకునేలా అవకాశం ఉండాలని.. అప్పుడే చిన్న సినిమాలు బతుకుతాయి అని, సినిమా ఇండస్ట్రీ బాగు పడాలంటే నాన్ యూనియన్ల మెంబర్స్ ను పెట్టుకునే అవకాశం ఉండాలని చిన్న నిర్మాతలు వేడుకుంటున్నారు.

Exit mobile version