సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ‘స్పిరిట్’. ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఐతే, లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతోందట. చైనీస్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని.. పైగా ఈ సినిమాకే కాకుండా, ప్రభాస్ సినీ కెరీర్ లోనే ఈ సీక్వెన్స్ హైలెట్ గా నిలిచిపోతుందని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజమైతే, ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతుంది.
కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఆ మధ్య హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. ‘ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ అని, ,దాన్ని కొనసాగిస్తానని హర్షవర్ధన్ రామేశ్వర్ పేర్కొన్నారు. ఇక స్పిరిట్ సినిమా విషయానికి వస్తే..ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి.
అన్నట్టు ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని తెలుస్తోంది. అన్నట్టు హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమా కోసం ఇప్పటికే సాంగ్స్ ను కంపోజ్ చేయడం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.