అది ప్రేమ, ఇది భాద్యత.!

అది ప్రేమ, ఇది భాద్యత.!

Published on Oct 31, 2012 10:39 AM IST


విలన్ గా కెరీర్ ప్రారంభించి తర్వాత హీరోగా మారిన శ్రీకాంత్ అనతి కాలంలోనే 100 సినిమాల మైలురాయిని చేరుకున్నారు. ఫ్యామిలీ హీరోగా పేరున్న శ్రీకాంత్ సోలో హీరోగానే గాక తన తోటి నటీనటులందరితో కలిసి నటించారు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మరియు నాగార్జున లాంటి హీరోలందరితో కలిసి సినిమాలు చేసారు. ఈ గురువారం శ్రీ కాంత్ హీరోగా నటించిన ‘లక్కీ’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ సందర్భంగా ఆయన్ని మీరు పెద్ద హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు, అదే సమయంలో సోలో హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు, ఈ రెండింటిలో మీకు ఏది ఎక్కువ ఆత్మ సంతృప్తిని కలిగించింది? అని అడిగితే శ్రీ కాంత్ సమాధానమిస్తూ ‘ నా కెరీర్ మొదట్లో చిరంజీవి గారితో ఒక్క సినిమాలోనైనా నటిస్తే చాలు అని అనుకున్నా కానీ ఆయనతో రెండు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలాగే బాలకృష్ణ, వెంకటేష్ మరియు నాగర్జున లతో కూడా కలిసి నటించే అవాకాశం నాకు దక్కింది. ఇలా అందరితో కలిసి నటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రత్యేక పాత్రలను ఎంతో ప్రేమతో చేస్తాను, అలాగే నేను హీరోగా చేసే సినిమాలని ఎంతో భాద్యతగా చేస్తాను’ అని ఆయన అన్నారు.

తాజా వార్తలు