ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు కారణమైన ఆర్ ఆర్ ఆర్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు కారణమైన ఆర్ ఆర్ ఆర్

Published on Feb 10, 2020 9:15 AM IST

రాజమౌళి ఎన్టీఆర్ లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్, ఎన్టీఆర్ మొదటి హిట్టు, రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ వన్ కాగా ఆతరువాత వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మూడవ చిత్రంగా వచ్చిన యమ దొంగ సైతం సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఆ చిత్రం విడుదలైన దాదాపు 12ఏళ్లకు మళ్ళీ రాజమౌళి ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడు. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు మిన్నంటాయి. దానితో పాటు ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కావడంతో వారు మరింత ఆనందపడ్డారు.

కానీ ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. తమ అభిమాన హీరో మూవీ కోసం వారు ఇంకా దాదాపు ఏడాది ఎదురుచూడాలి. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ కారణంగా ఎన్టీఆర్ 2019లో మూవీ చేయకుండానే ముగించాడు. ఆర్ ఆర్ ఆర్ విడుదల 2021 జనవరి 8కి వాయిదాపడటం తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండేళ్లు ఆయనను తెరపై మిస్సయ్యారు. ఇదే వారిని ఇప్పుడు నిరాశకు గురిచేస్తుంది. ఎన్టీఆర్ గత చిత్రం అరవింద సమేత వీరరాఘవ 2018 అక్టోబర్ 11న విడుదల అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎన్టీఆర్ చేస్తున్నందుకు వారు ఎంత ఆనందపడ్డారో..దాని కారణంగా రెండేళ్లు ఎన్టీఆర్ ని తెరపై మిస్ కావడం అంతే నిరాశకు గురి చేస్తుంది.

తాజా వార్తలు