1996లో వచ్చిన పోలీస్ స్టోరీ నటుడు సాయి కుమార్ ఇమేజ్ పూర్తిగా మార్చివేసింది. సీరియస్ అండ్ సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రలో సాయి కుమార్ నటన దశాబ్దాలు గడిచినా ఎవరూ మరచిపోరు. ఇక ఆ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్సే. ఆ మూవీతో వచ్చిన ఇమేజ్ తో సాయి కుమార్ వరుసగా యాక్షన్ చిత్రాలు చేశారు.అందులో 1998లో వచ్చిన ఈశ్వర్ అల్లా కూడా ఒకటి. కాగా ఆ సినిమా వలన నటుడు సాయి కుమార్ పడిన ఆర్థిక ఇబ్బందులను ఇటీవల సాయికుమార్ ఓ సంధర్భంలో గుర్తుచేసుకున్నారు.
అప్పట్లోనే 2 కోట్ల బడ్జెట్ తో ఆ చిత్రాన్ని తన తమ్ముడు అయ్యప్ప శర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. అప్పట్లో 2 కోట్లు అంటే భారీ బడ్జెట్ అని అర్థం. సాయి కుమార్ మార్కెట్ లెక్కల రీత్యా కూడా తలకు మించిన భారం. ఆ మూవీలో సాయి కుమార్ తండ్రి పీజే శర్మ విలన్ గా నటించంతో కాంబినేషన్ క్రేజ్ వలన మూవీ ఆడుతుందని భావించి ఆ మూవీ తెరకెక్కించారట. తీరా ఆ సినిమా చూసిన బయ్యర్లు కొనడానికి ముందుకు రాలేదు. పీజే శర్మ విలన్ కావడంతో సాయి కుమార్ క్లైమాక్స్ లో కొట్టే సీన్ ఉంది. దాన్ని ప్రేక్షకులు అంగీకరించరు అని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం జరిగింది. చివరకు దాసరి నారాయణరావు చొరవతో ఆ మూవీ విడుదల కాగా, డిస్ట్రిబ్యూటర్స్ చెప్పినట్లే, ప్లాప్ గా నిలిచింది. ఆ మూవీ వలన సాయి కుమార్ కి 2 కోట్ల అప్పు మిగలగా, అది తీర్చడానికి 15 సినిమాలు చేయాల్సివచ్చిందట.