ఈ నెల 6న వంశీ ‘తను మొన్నే వెళ్ళిపోయింది’ ఆడియో లాంచ్

Tanu-Monne-Vellipoind

విలక్షణ దర్శకుడు వంశీ 25వ సినిమా ‘తను మొన్నే వెళ్ళిపోయింది’ ఆడియోను ఈనెల 6న హైదరాబాద్ లో విడుదలచెయ్యనున్నారు. ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తిచసుకుని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ చిత్రంలో ‘రంగం’ సినిమాలో మెరిసిన అజ్మల్, నిఖితా నారాయణ్ లు జంటగా నటించారు

ఈ సినిమాకు చక్రి సంగీత దర్శకుడు. వంశీ, చక్రి కలయికలో వస్తున్న 6వ సినిమా ఇది. దీనికంటే ముందు వీరిద్దరూ సరదాగా కాసేపు, గోపి గోపిక గోదావరి, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు వంటి సినిమాలకు కలిసి పనిచేసారు. ఈ తాజా చిత్రం వంశీ మార్కు టచ్ తో రొమాంటిక్ గా సాగనుంది

ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలకానుంది. గతంలో ఎన్నో మధురమైన సినిమాలతో మనల్ని అలరించిన వంశీ ఈ సినిమాతో మరోసారి పూర్వవైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుందాం

Exit mobile version