అక్టోబర్ లో రానున్న తను మొన్నే వెళ్ళిపోయింది

అక్టోబర్ లో రానున్న తను మొన్నే వెళ్ళిపోయింది

Published on Aug 20, 2013 8:20 AM IST

TMV
విభిన్న తరహాలో సినిమాలు తీసే డైరెక్టర్ వంశీ తీస్తున్న కొత్త సినిమా ‘తను మొన్నే వెళ్ళిపోయింది’. ‘రంగం’, ‘రచ్చ’ సినిమాలతో పేరు తెచ్చుకున్న అజ్మల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నిఖితా నారాయణ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని అక్టోబర్ లో రిలీజ్ చెయ్యడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ సినిమా ఆడియోని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా వంశీ దర్శకత్వం వహిస్తున్న 25వ సినిమా కావడం వల్ల కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చక్రి సంగీతం అందిస్తున్న ఈ సినిమా మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేస్తారు.

తాజా వార్తలు