ఈ రోజుల్లో సందేశాత్మక, సూక్తి ప్రధానమైన సినిమాలకు ఆదరణ తక్కువని, నవ్విస్తేనే జనాలు చుస్తారాని దర్శకుడు వీరభద్రమ్ తెలిపారు. అందుకే ఆయన ‘అహ నా పెళ్ళంట’, ‘పూలరంగడు’ వంటి హాస్య ప్రధానమైన సినిమాలను తీసారు. తన మూడో చిత్రమే అగ్ర కధానాయకుడు నాగార్జునతో ‘భాయ్’గా చెయ్యడానికి తను ఎలాంటి ఒత్తిడికీ లోనుకావడంలేదట. ఎందుకంటే నాగార్జున తనకు కావాల్సిన ధైర్యాన్ని అందించారట. సినీ రంగంలో పాతికేళ్ళ అనుభవం, అనుబంధం ఉన్న కారణంగా ఎలాంటి సన్నివేశాలను తీస్తే ప్రేక్షకులు మెచ్చుకుంటారో తెలుస్తుందని అన్నారు. కృష్ణ వంశీ, ఈ.వి.వి సత్యన్నారాయణ, తేజ ల దగ్గర తను పని చేసినప్పుడు తెలుసుకున్న విషయాలు తనకెంతో ఉపయోగపడ్డాయని చెప్పారు. ఈ రోజు ఆయన జన్మదినం. సో ఈ సందర్భంగా ఆయన తీస్తున్న ‘భాయ్’ ఘన విజయం సాదించాలని కోరుకుంటూ 123తెలుగు ద్వారా వీరభద్రమ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం.