మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పప్పు బాలాజీ రెడ్డి నిర్మాణంలో, తోట శ్రీకాంత్ కుమార్ రచన-దర్శకత్వంలో రూపొందిన “థాంక్యూ డియర్” చిత్రం ఆగస్టు 1న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, ధనుష్ రఘుముద్రి, రేఖ నిరోషా ప్రధాన పాత్రల్లో నటించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా వరల్డ్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కి అనుకూలంగా రూపొందించబడింది.
ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో ప్రదర్శించబడింది. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు, హెబ్బా పటేల్‌కు ఉత్తమ నటిగా, బాలాజీ రెడ్డికి డెబ్యూ ప్రొడ్యూసర్‌గా, ఇతర నటీనటులకు కూడా అవార్డులు లభించాయి. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.
ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో దర్శకుడు శ్రీకాంత్ తోట మాట్లాడుతూ, “సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి సందేశాన్ని అందిస్తుంది. ఇప్పటికే ఎన్నో అవార్డులు రావడం ఆనందంగా ఉంది,” అన్నారు. నిర్మాత బాలాజీ, హీరో ధనుష్ రఘుముద్రి కూడా సినిమా విజయంపై ఆశాభావం వ్యక్తం చేశారు.