ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న పలు అవైటెడ్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య అక్కినేని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన భారీ చిత్రం “తండేల్” కూడా ఒకటి. మరి అనౌన్స్ అయ్యిన నాటి నుంచే మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం రీసెంట్ గా వచ్చిన పాటలతో కూడా ఆడియెన్స్ లో మరింత రీచ్ అందుకుంది.
ఇక ఇదిలా ఉండగా మేకర్స్ ఆల్రెడీ సినిమా ప్రమోషన్స్ ని జోరుగా చేస్తుండగా ఇపుడు చిత్ర మెయిన్ యూనిట్ అంతా కలిపి ఒక ఎనర్జిటిక్ ఇంటర్వ్యూని ప్లాన్ చేశారు. హీరో హీరోయిన్స్ సహా దర్శకుడు చందూ మొండేటి అలాగే దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ సైతం ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఇంటర్వ్యూలో చాలా స్పెషల్ ఎలిమెంట్స్ ఉండేలా ఉన్నాయి. ఇక ఈ ఇంటర్వ్యూకి డేట్ రావాల్సి ఉంది. మరి ట్రైలర్ ని అయితే ఈ జనవరి 28న రిలీజ్ కి తీసుకొస్తుండగా ఫిబ్రవరి 7న గ్రాండ్ గా సినిమా రిలీజ్ కి రాబోతుంది.
A super energetic interview with Team #Thandel loading ❤️????
This is going to be a fun ride. Full interview out soon ????????#ThandelTrailer out on January 28th.
In Cinemas #ThandelonFeb7th ????⚓️
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP @GeethaArts… pic.twitter.com/5E4jLCPyio
— Geetha Arts (@GeethaArts) January 26, 2025