స్పెషల్ ప్రీమియర్స్‌కు ‘తమ్ముడు’ దూరం..!

స్పెషల్ ప్రీమియర్స్‌కు ‘తమ్ముడు’ దూరం..!

Published on Jul 3, 2025 3:00 AM IST

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్, ఎమోషనల్ కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేశారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించి స్పెషల్ ప్రీమియర్స్ వేస్తామని నిర్మాత దిల్ రాజు రీసెంట్‌గా ప్రకటించారు.

కానీ, ప్రస్తుతం నెలకొన్న ఓ వివాదం కారణంగా ఆయన ఈ నిర్ణయాన్ని విరమించుకున్నారు. అంతేగాక ఈ సినిమాకు పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ చిత్రాన్ని జూలై 4న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఏదేమైనా ఈ నిర్ణయం మంచిదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు