తను పనిచేసిన సినిమాలకు పెప్పీ ట్యూన్ లను, ఎనెర్జిటిక్ సంగీతాన్ని ఇవ్వడంలో థమన్ సిద్ధహస్తుడు. ఈ సంగీత దర్శకుడు తన కెరీర్ లో మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకుడు. శ్రీకాంత్ ముఖ్యపాత్రపోషించనున్నాడు
ఈ సినిమాలో చరణ్ సరసన కాజల్ నటించనుంది. స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ చిత్రనిర్మాత. ఈ సినిమా భావోద్వేగాలతో నిండిన కృష్ణ వంశీ మార్కు సినిమాగా సాగనుంది
ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. విజయాలు లేక డీలా పడిపోయిన కృష్ణవంశీకి ఈ సినిమా విజయం చాలా అవసరం