‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం హరిహర వీరమల్లు తర్వాత వస్తున్న మరో అవైటెడ్ చిత్రమే “ఓజి”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ఉన్న హైప్ మాత్రం వేరే లెవెల్. ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఎపుడు నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సాంగ్ పై థమన్ లేటెస్ట్ గా ఇచ్చిన హింట్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తుంది.

ఒక గన్ ఎమోజి పెట్టి ‘కల్ట్స్’ అంటూ చిన్న పోస్ట్ చేసాడు. దీనితో ఓజి ఫస్ట్ సింగిల్ కోసం ఈ అలర్ట్ చేస్తున్నట్టుగా ఫ్యాన్స్ కి అర్ధం అయ్యిపోయింది. ఇక ఈ ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ ఆగస్ట్ లో విడుదల చేస్తున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.

Exit mobile version