ప్రస్తుతం దక్షిణాది సినిమా దగ్గర చాలా వరకు సినిమాలు మేజర్ గా సంగీతం మీదే ఆధారపడి ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా కొందరు టాప్ సంగీత దర్శకులు నుంచి అయితే మినిమమ్ ఆడియెన్స్ ఆశిస్తున్నారు. ఇలా కొందరి సంగీత దర్శకుల సినిమాలకి సెపరేట్ క్రేజ్ నెలకొనగా అలాంటి సంగీత దర్శకుల్లో అనిరుద్ కూడా ఒకడు.
అయితే అనిరుద్ కి మన టాలీవుడ్ నుంచి ఇప్పుడు టఫ్ కాంపిటీటర్ గా సంగీత దర్శకుడు థమన్ నిలుస్తున్నాడని చెప్పాలి. ఈ మధ్య కాలంలో థమన్ నుంచి వస్తున్న బ్యాంగర్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా అనిరుద్ నుంచి వచ్చిన టీజర్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ సినిమాలో అనిరుద్ స్కోర్ పై చర్చ వినిపిస్తుంది. ఇది వరకు ఏ గ్లింప్స్ లేదా టీజర్ లలో అనిరుద్ స్కోర్ బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచేది కానీ అనూహ్యంగా ఈసారి అలాంటి టాక్ రాలేదు.
అసలే ఈ సినిమా బాలయ్య భగవంత్ కేసరి కి రీమేక్ అనే టాక్ ఉంది. ఆ సినిమాకి థమన్ క్రేజీ సంగీతం అందించాడు. మరి జన నాయకుడు గ్లింప్స్ కి అనిరుద్ ఇచ్చిన స్కోర్ కంటే థమన్ ఇచ్చిన స్కోర్ పెడితేనే అదిరిపోయింది అని నెటిజన్స్ అంటున్నారు. దీనితో థమన్ డామినేషన్ మామూలుగా లేదని చెప్పొచ్చు. ఇక థమన్ నుంచి మరిన్ని బ్యాంగర్స్ రాబోతున్నాయి. వీటిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.