రిపోర్ట్: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. ఉపేంద్ర రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!

రిపోర్ట్: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. ఉపేంద్ర రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!

Published on Jun 22, 2025 9:08 PM IST

మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఆంధ్రా కింగ్ తాలూకా”. మరి ఈ సినిమా ప్రతీ సినిమా అభిమాని బయోపిక్ లా మేకర్స్ అనౌన్స్ చేయగా ఈ చిత్రం కోసం ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో రామ్ ఆ సినిమాలో స్టార్ హీరో ఉపేంద్రకి వీరాభిమానిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. మరి ఉపేంద్ర రోల్ పై ఓ ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ఇపుడు వినిపిస్తుంది. తనపై దర్శకుడు సాలిడ్ ఎమోషనల్ సీన్స్ రాసుకున్నాడట. సినిమాలో తనపై తన స్టార్డం కోల్పోయిన సమయంలో వచ్చే పలు ఛాన్స్ లకి సంబంధించి తెరకెక్కించిన సీన్స్ చాలా బాగా వచ్చాయని తెలుస్తోంది.

థియేటర్స్ లో మాత్రం ఈ సీన్స్ గట్టిగా పేలతాయట. మరి ఈ చిత్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి వివేక్ మెర్విన్ లు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు