మరోసారి మహేష్ బాబు సినిమాకి థమన్ మ్యూజిక్

మరోసారి మహేష్ బాబు సినిమాకి థమన్ మ్యూజిక్

Published on Jun 22, 2013 2:56 PM IST

S.Thaman-Image
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ శ్రీను వైట్లకి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అంటే చాలా ఇష్టం. దీనితో వారు ‘ఆగాడు’ సినిమాకి థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాతో థమన్ మరోసారి మహేష్ బాబు సినిమాకి సంగీతాన్ని అందించనున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం తరువాత ప్రారంభమయ్యే అవకాశం వుంది. ఈ సినిమా యాక్షన్ తో పాటు కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకేక్కవచ్చని సమాచారం. మహేష్ బాబు, శ్రీను వైట్ల కలిసి చేసిన సినిమా ‘దూకుడు’ మంచి విజయాన్ని సాదించింది. దీనితో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాదిస్తుందని బావిస్తున్నారు.

తాజా వార్తలు