మహేష్ కోసం అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేస్తున్న థమన్

మహేష్ కోసం అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేస్తున్న థమన్

Published on Jul 22, 2020 2:09 AM IST


యంగ్ సెన్సేషన్ థమన్ మ్యూజిక్ ఈ మధ్య సంగీత ప్రియులను మెస్మరైజ్ చేస్తుంది. ఇక అల వైకుంఠపురంలో సాంగ్స్ అయితే పెద్ద సంచలనానికి తెరలేపాయి. యూట్యూబ్ లో ఆ చిత్ర సాంగ్స్ వందల మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంటూ కొత్త రికార్డ్స్ నమోదు చేస్తున్నాయి. టాలీవుడ్ లో హాట్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ,మారిన థమన్ పెద్ద పెద్ద సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. థమన్ పనిచేస్తున్న భారీ చిత్రాలలో మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట ఒకటి.

కాగా ఈ చిత్రం కోసం ట్యూన్స్ కట్టే పని ఇప్పటికే మొదలుపెట్టేశాడట థమన్. సర్కారు వారి పాట స్టోరీ లైన్ మరియు మహేష్ ఇమేజ్ కి తగ్గట్టుగా సూపర్ ట్యూన్స్ సిద్ధం చేస్తున్నాడట. సర్కారు వారి పాట మూవీ సాంగ్స్ తో థమన్ మరో మారు సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అని తెలుస్తుంది. గతంలో మహేష్- థమన్ కాంబినేషన్ లో వచ్చిన బిజినెస్ మాన్, దూకుడు చిత్రాల సాంగ్స్ మంచి ఆదరణ దక్కించుకున్నాయి.

తాజా వార్తలు