అల వైకుంఠపురంలో సాంగ్స్ తో థమన్ క్రేజ్ పదిరెట్లు పెరిగింది. ఒక దశలో ఫార్మ్ కోల్పోయి చిన్న హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించిన థమన్ అల వైకుంఠపురంలో ఆల్బం తో ఆటం బాంబులా పేలాడు. దేశవ్యాప్తంగా అల వైకుంఠపురంలో సాంగ్స్ అలరించాయి. బాలీవుడ్ ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. కాగా ప్రభాస్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ చిత్రానికి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ని నిర్ణయించలేదు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో మ్యూజిక్ డైరెక్టర్ పేరు మెన్షన్ చేయలేదు.
ఈ నేపథ్యంలో థమన్ కూడా నిర్మాతల దృష్టిలో ఉన్నారని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ కనుక థమన్ కి దక్కితే లక్కు చిక్కినట్లే. థమన్ మొదటిసారి ఓ పాన్ ఇండియా చిత్రానికి సంగీతం అందించినట్లు అవుతుంది. రాధే శ్యామ్ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ సెన్సిబుల్ పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా…పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.