ఓవర్సీస్ మార్కెట్ లో ‘జన నాయగన్’ కి రికార్డు బిజినెస్?

Jana-Nayagan

ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న చివరి సినిమానే “జన నాయగన్”. తెలుగులో జన నాయకుడిగా వస్తున్న ఈ సినిమాని దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ కూడా అందిస్తుండగా ఈ సినిమా తాలూకా ఓవర్సీస్ బిజినెస్ కి సంబంధించి లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది. విజయ్ సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ లో భారీ క్రేజ్ ఉంది.

అందుకు తగ్గట్టుగానే తన సినిమాలకి వసూళ్ళలో ఇక్కడ నుంచే చాలా ప్లస్ కూడా అవుతాయి. మరి అందుకు తగ్గట్టుగానే గట్టి బిజినెస్ ని ఈ సినిమా చేసినట్టు తెలుస్తుంది. ఒక్క యూఎస్ మార్కెట్ మినహా మిగతా దేశాల్లో దాదాపు ఆల్ టైం రికార్డు బిజినెస్ ని ఈ సినిమా చేసిందట. గల్ఫ్ దేశాలు, సింగపూర్, మలేషియా లాంటి చోట్ల కూడా గట్టి టార్గెట్ నే ఈ సినిమా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఎంత రాబడుతుందో చూడాలి.

Exit mobile version