నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ సూపర్ హుక్ చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్లో చేసిన సూపర్ హిట్ చిత్రం “భగవంత్ కేసరి” కూడా ఒకటి. అయితే ఈ సినిమాని ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ జన నాయకుడు పేరిట రీమేక్ చేస్తున్నట్టుగా ఇప్పుడు దాదాపు కన్ఫర్మ్ అయ్యిపోయింది.
ఇది వరకు ఇది రీమేక్ కాదనే టాక్ వినిపించింది. కానీ లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ లో విజువల్స్ చూసి ఒకింత తమిళ ఆడియెన్స్ నే ఎక్కువగా ఇది భగవంత్ కేసరి రీమేక్ అని చెప్పేస్తున్నారు. విజయ్, పూజా హెగ్డే అలాగే మమితా బైజు ముగ్గురు భగవంత్ కేసరిలో బాలయ్య, కాజల్ అలాగే శ్రీలీల లని రిప్రెజెంట్ చేస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తున్నారు.
విజయ్ గెటప్ కూడా అక్కడ ఓల్డ్ లుక్ లోనే కనిపిస్తుండడం ఈ సినిమా రీమేక్ అనే అర్థం అవుతుంది. కానీ ఒకవేళ రీమేక్ అయితే మాత్రం ఈ సినిమా ఆల్రెడీ మన దగ్గర చూసేసాం అయినప్పటికీ తీసుకొస్తే ఇక్కడ వర్కువుట్ అవుతుందా అనేది అసలు ప్రశ్న. మరి చూడాలి జన నాయకుడు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడు అనేది.
