చిరు, చరణ్, నెక్స్ట్ ‘ఉస్తాద్’ మోత.. అంచనాలు ఎన్నైనా ఓకే అట

pawan ustaad bhagat singh song

మెగా అభిమానులకి ఈ ఏడాదిలో కొన్ని డిజప్పాయింట్మెంట్ లతో పాటుగా కొన్ని హై మూమెంట్స్ కూడా సినిమాల పరంగా దక్కాయని చెప్పాలి. ఇలా లేటెస్ట్ గా ఈ మెగాస్టార్ చిరంజీవి అలాగే తన వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు తమ నెక్స్ట్ సినిమాలు మన శంకర వరప్రసాద్ గారు, పెద్ది సినిమాల ఫస్ట్ సింగిల్స్ తో సూపర్ హిట్ కొట్టారు.

ఇక నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ మిగిలి ఉంది. అయితే ఈ సాంగ్ మాత్రం అంచనాలు ఎక్కువే పెట్టుకోమని ఉస్తాద్ టీం కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నారు. దీనితో ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి సంగీతం అందించాడు అనేది అర్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఈ ఏడాది డిసెంబర్ 31కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఉంది. మరి అప్పుడే వస్తుందా ఇంకా ముందే వస్తుందా అనేది వేచి చూడాలి.

Exit mobile version