తాజా సమాచారం ప్రకారం ‘తడాఖా’ మే 10న మనముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు సిద్దంగావున్నా నాగార్జున ‘గ్రీకువీరుడు’ విడుదలను పురస్కరించుకుని ఈ చిత్రాన్ని వాయిదా వేసారంట. సమాచారం ప్రకారం నాగార్జున ఈ సినిమాను మే 10 న విడుదల చెయ్యడానికి అంగీకరించారట. రేపు తుదినిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించవచ్చు.
ఈ సినిమా తమిళ సూపర్ 2`హిట్ ‘వెట్టాయ్’ సినిమాకు రీమేక్. ఈ ‘తడాఖా ‘లో నాగచైతన్య, సునీల్ సరసన తమన్నా, ఆండ్రియా జెరేమియా నటిస్తున్నారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ దర్శకుడు డాలి ఈ సినిమా డైరెక్టర్. బెల్లంకొండ సురేష్ నిర్మాత. థమన్ సంగీతాన్ని అందించాడు.