ఏప్రిల్ 24న నాగ చైతన్య – సునీల్ ‘తడాఖా’ ఆడియో?

First Posted at 20.10 on Apr 18th

Nag_Sunil

అక్కినేని నాగ చైతన్య – సునీల్ అన్నదమ్ములుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా ‘తడాఖా’. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోని ఏప్రిల్ 24న విడుదల చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మేలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి కిషోర్ కుమార్(డాలీ) డైరెక్టర్. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన మిల్క్ బ్యూటీ తమన్నా, సునీల్ సరసన ఆండ్రియా జెరేమియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇది తమిళంలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ తమిళ సినిమా ‘వేట్టై’ కి రీమేక్. బెల్లం కొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. జూన్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

Exit mobile version