సోమవారం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనున్న ‘తడాఖా’

సోమవారం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనున్న ‘తడాఖా’

Published on May 4, 2013 11:02 PM IST

images (1)

అక్కినేని నాగ చైతన్య, సునీల్ హీరోలు గా నటించిన సినిమా ‘తడాఖా‘. ఈ సినిమా సోమవారం రోజు సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుంది. మే 10న విడుదల చేయనున్న ఈ సినిమా పోస్ట్ – ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తైయ్యాయి. ఈ సినిమాని తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వెట్టాయ్’ సినిమాకి రీమేక్ గా నిర్మించారు. ఈ ‘తడాఖా‘లో నాగచైతన్య, సునీల్ సరసన తమన్నా, ఆండ్రియా జెరేమియా హీరోయిన్స్ గా నటించారు. కామెడీ, యాక్షన్ తోఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ దర్శకుడు డాలి ఈ సినిమా డైరెక్టర్. బెల్లంకొండ సురేష్ నిర్మాత. థమన్ సంగీతాన్ని అందించాడు.

తాజా వార్తలు