ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కి బాగా ప్రాముఖ్యతని ఇస్తారు. ప్రస్తుతం ఒక భయంకరమైన న్యూమరాలజీ సీక్వెన్స్ ని ఇండస్ట్రీని బాగా భయపెడుతోంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం..
రియల్ స్టార్ శ్రీహరి అక్టోబర్ 9న చనిపోయారు, కమెడియన్ ఏవిఎస్ నవంబర్ 8న చనిపోయారు, మరో కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం డిసెంబర్ 7న చనిపోయారు. ప్రస్తుతానికి వస్తే హీరో ఉదయ్ కిరణ్ జనవరి 6న మరణించాడు. మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ప్రతి నెల వరుసగా 9, 8, 7, 6 తేదీలలో ఒక్కో సెలబ్రిటీ చనిపోతూ వస్తున్నారు.
‘చెప్పాలంటే ఇది ఒక భయంకరమైన సీక్వెన్స్. 2014 ప్రారంభం చాలా భాధాకరంగా మొదలైంది. అలాగే శ్రీహరి దగ్గర నుంచి ప్రతినెలా వరుసగా ఎవరో ఒకరు చనిపోవడం కాస్త భయాందోళనకి గురి చేస్తోంది. ఇప్పుడు ఫిబ్రవరి 5న ఏం జరగబోతుందా? అని భయంగా ఉందని’ ఓ సీనియర్ ఫిల్మ్ ఫోటోగ్రాఫర్ అన్నాడు.
ఈ రోజు జరిగిన సంఘటనతో ఇలాంటి ఘటనలు ఇక జరగవని ఆశిద్దాం..