‘ఓదెల 2’ ఓటిటి డేట్ లాక్ అయ్యిందా?

‘ఓదెల 2’ ఓటిటి డేట్ లాక్ అయ్యిందా?

Published on May 4, 2025 10:00 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన లేటెస్ట్ చిత్రం “ఓదెల 2” కోసం అందరికీ తెలిసిందే. తన రచ్చ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించిన ఈ హారర్, డివోషనల్ చిత్రం థియేటర్స్ లో పర్వాలేదనిపించింది. అయితే రిలీజ్ కి ముందే సాలిడ్ బిజినెస్ ని చేసేసుకున్న ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమా హక్కులని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ రానున్న మే 16న కానీ లేదా అంతకు ముందే అందుబాటులోకి వచ్చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా డి మధు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు