మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు తెరకెక్గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కింగ్డమ్”. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ సాధించి అదరగొట్టింది. ఇక ఈ చిత్రం థియేటర్స్ లో ఆల్మోస్ట్ రన్ ని కంప్లీట్ చేసుకుంటుండగా నెక్స్ట్ ఓటిటి రిలీజ్ కి సినిమా సిద్ధం అవుతుంది.
అయితే ఈ సినిమా ఓటిటి హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో కింగ్డమ్ ఓటిటి డేట్ లాక్ అయినట్టు ఇప్పుడు బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఓటిటిలో ఆగస్ట్ 28 లేదా 29 నుంచి ఓటిటిలో అందుబాటులోకి వస్తుంది అని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతమేర నిజం ఉందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణం వహించారు.