‘తెలుసు కదా..’.. మూడు రోజుల కలెక్షన్స్ ఇవే..!

స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘తెలుసు కదా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను నీరజా కోన డైరెక్ట్ చేయగా, పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ సినిమాకు మిక్సిడ్ రివ్యూలు వచ్చినా బాక్సాఫీస్ దగ్గర మంచి రన్ కొనసాగిస్తోంది.

ఈ సినిమా తొలి మూడు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.14.1 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. వరుస సెలవులు కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ పికప్ అయ్యాయి. దీంతో దీపావళి సెలవురోజు కూడా ఈ చిత్ర కలెక్షన్స్‌కు హెల్ప్ అవుతాయని మేకర్స్ భావిస్తు్న్నారు.

ఇక ఈ సినిమాలో అందాల భామలు రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version