‘బన్నీ’ సినిమాతో అద్భుతాన్ని చూస్తారు – రణ్‌వీర్‌

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్ సతీమణి దీపికా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఐతే, తాజాగా రణ్‌వీర్‌ సింగ్‌ తన కామెంట్స్‌తో ఈ సినిమాపై హైప్‌ను పెంచేశారు. అట్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ‘అట్లీ జవాన్‌తో భారతదేశంలో అతిపెద్ద దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అట్లీ ‘మెర్సల్‌’ చూశాక మీతో సినిమా తీయాలని ఉంది అని నేను తనకు మెసేజ్‌ చేశాను. అట్లీ దర్శకత్వంలో వర్క్‌ చేయడం కోసం ఎదురుచూస్తున్నాను’ అని రణ్‌వీర్‌ తెలిపారు.

రణ్‌వీర్‌ ఇంకా కామెంట్స్ చేస్తూ.. ‘నేను ఇటీవల అల్లు అర్జున్‌ సినిమా షూటింగ్‌ సెట్‌కు వెళ్లాను. సెట్‌ చూసి ఆశ్చర్యపోయాను. మీరు ఇప్పటివరకూ చూడని ఓ అద్భుతాన్ని అట్లీ మీకు చూపించనున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఇలాంటి చిత్రం రాలేదు’’ అని రణ్‌వీర్‌ చెప్పుకొచ్చాడు. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమా కోసం అట్లీ ప్రత్యేకంగా గెస్ట్ రోల్స్ ను డిజైన్ చేస్తున్నాడట. మరి ఆ గెస్ట్ రోల్స్ కోసం అట్లీ ఎవర్ని అప్రోచ్ అవుతాడో చూడాలి.

Exit mobile version