కర్ణాటకపై పోరాడి ఓడిన తెలుగు వారియర్స్

కర్ణాటకపై పోరాడి ఓడిన తెలుగు వారియర్స్

Published on Feb 16, 2014 1:00 AM IST

Telugu-Warriors-and-karnata
సెలబ్రిటీ లీజ్ 4వ సీజన్ లో తెలుగు వారియర్స్ జట్టు ఆఖరి లీగ్ మ్యాచ్ ఈరోజు రాత్రి లాల్ బహుదూర్ స్టేడియం లో కర్ణాటక బుల్ డోజర్లతో జరిగిన విషయం విదితమే. సెమీ ఫైనల్ కు వెళ్ళాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో మనవాళ్ళు పోరాడి ఓడిపోయారు

ముందుగా బ్యాటింగ్ చేసిన మన జట్టులో అఖిల్ అక్కినేని కేవలం 46 బంతుల్లో 90 పరుగులు చేయడంతో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేశాము. కానీ కర్ణాటక జట్టు మొదట్నుంచి బాగా ఆడి రాజీవ్ చివర్లో 20 బంతులలో 53 కొట్టి మెరిపించడంతో కర్ణాటక విజయం సాధించింది

మరో మ్యాచ్ లో వీర్ మరాటి టీం పై ముంబై గెలిచింది. శృతిహాసన్, చిత్రాంగధా సింగ్, జెనీలియా వంటి ప్రముఖులు ఈ మ్యాచ్ లలో మెరిసారు

తాజా వార్తలు