కూలీ ఎఫెక్ట్.. లోకేష్‌తో ఆ ఇద్దరు హీరోలు సినిమాలు చేయరా..?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ సెన్సేషన్ కూలీ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. లోకేష్ కనగరాజ్ ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించిన ఈ సినిమా తొలిరోజు మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. యాక్షన్ పరంగా ఈ సినిమా అదిరిపోయినా, రైటింగ్ పరంగా కాస్త వెనుకబడిందని ఈ చిత్రాన్ని చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో లోకేష్ కెరీర్‌లోనే ఇది వీక్ రైటింగ్ అని పలువురు సినీ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక లోకేష్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు జాగ్రత్త పడుతున్నారని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో లోకేష్‌తో రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ, ఇప్పుడు కూలీ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి వారు లోకేష్‌తో ఇప్పట్లో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది.

అటు లోకేష్ కూడా తన నెక్స్ట్ చిత్రం తమిళ హీరో కార్తీతో ‘ఖైదీ 2’ చేసేందుకు ప్రణాళిక రెడీ చేసుకుంటున్నాడు. మరి భవిష్యత్తులో తెలుగు హీరోలతో లోకేష్ సినిమా చేస్తాడా లేడా అనేది వేచి చూడాలి.

Exit mobile version