ఈ రోజు పోలీసులు అక్రమంగా మారణాయుధాలు మరియు పేలుడు పదార్థాలు తన ఇంట్లో ఉంచుకున్నందుకు ఒక తెలుగు సినిమా నిర్మాతను అరెస్ట్ చేసారు. జూబ్లీ హిల్స్ పోలీసులు నిర్మాత రామ కృష్ణ ఇంటిని సోదా చేయగా రెండు పిస్టోల్స్ మరియు 14 రౌండ్ల మందు గుండు సామాగ్రి దొరికింది. వీటికి రామ కృష్ణ దగ్గర లైసెన్స్ కూడా లేదు. ఈయన గతంలో పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో ‘నా పెళ్ళాం నా ఇష్టం’ అనే సినిమాని తీసారు. రామ కృష్ణ పోలీసులకు తన తీయబోయే సినిమా కోసమే అవన్నీ తెప్పించానని చెప్పారు. ప్రస్తుతానికి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి మిగతా విశేషాలను దర్యాప్తు చేస్తున్నారు.