బిగ్ న్యూస్ : తెలుగు ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం.. వారికి భారీగా అవకాశాలు!

తెలుగు చిత్ర పరిశ్రమలో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులకు భారీ అవకాశాలు ఇచ్చేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. సినిమా పరిశ్రమలో తమ వేతనాలు పెంచాలంటూ సినిమా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చిత్ర కార్మిక సంఘాలు తమకు 30 శాతం వేతనం పెంచాలని డిమాండ్ చేయడంతో నేడు తెలుగు ఛాంబర్‌లో సినీ నిర్మాతల మండలి సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ తర్వాత వారు ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటన రూపంలో వెల్లడించారు. నైపుణ్యం ఉన్న ప్రతిభావంతులకు సినిమా పరిశ్రమలో పనిచేసేందుకు ఇకపై ఎలాంటి యూనియన్ మెంబర్‌షిప్ అవసరం లేదని.. వారితో ఏ నిర్మాత అయినా పని చేయించుకోవచ్చని తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత లేనిదే సినిమా లేదు. అలాంటి నిర్మాత శ్రేయస్సు కోసం తెలుగు సినిమా మనుగడ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుగు ఫిలిం ఛాంబర్ వెల్లడించింది.

Exit mobile version