ఓటిటి రిలీజ్ తర్వాత ‘హిట్ 3’ దర్శకునిపై తెలుగు ఆడియెన్స్ విమర్శలు!

ఓటిటి రిలీజ్ తర్వాత ‘హిట్ 3’ దర్శకునిపై తెలుగు ఆడియెన్స్ విమర్శలు!

Published on May 29, 2025 5:24 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన రీసెంట్ సాలిడ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమే “హిట్ 3”. యువ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ నటుడు కార్తీ కూడా మంచి క్యామియోలో నటించిన సంగతి తెలిసిందే.

క్లైమాక్స్ లో నాలుగో పార్ట్ కి లీడ్ గా కార్తీని పరిచయం చేస్తూ చూపించిన విజువల్స్ థియేటర్స్ లో అభిమానులు చేత ఈలలు వేయించాయి. అయితే అప్పుడు అంతా బాగానే ఉంది కానీ ఇదే సీన్ విషయంలో నేడు ఓటిటిలో రిలీజ్ కి వచ్చాక తెలుగు ఆడియెన్స్ దర్శకుడిపై విమర్శలకి చేస్తున్నారు.

కార్తీ తమిళ్ డబ్బింగ్ వెర్షన్ లో తెలుగు ప్రజలని అవమానించే పదం ఎలా వాడుతారని తెలుగు ఆడియెన్స్ ని తెలుగు వారైన మీరే మనల్ని అవమానించుకోవడం ఏంటి అని అలాంటి మాటని ఎలా పెడతారని విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై వారి నుంచి ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి లేదా దానిని సవరణ అయినా చేయాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు