OG : తెలంగాణలో టికెట్ రేట్లు తక్షణమే తగ్గించాలని ప్రభుత్వం ఆదేశం

OG : తెలంగాణలో టికెట్ రేట్లు తక్షణమే తగ్గించాలని ప్రభుత్వం ఆదేశం

Published on Sep 29, 2025 9:00 PM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓజీ’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.

కాగా, ఈ సినిమా టికెట్ రేట్లను పెంచుతూ గతంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100/-, మల్టీప్లెక్స్‌లలో రూ.150/- మేర టికెట్ రేట్లు పెంచేందుకు తెలంగాణ సర్కార్ అనుమతినిచ్చింది. అయితే, ఈ విషయంపై బర్ల మల్లేశ్ యాదవ్ అనే వ్యక్తి కోర్టుకెక్కారు. దీంతో ఇప్పుడు ఈ చిత్ర టికెట్ రేట్లు తక్షణమే తగ్గించాలంటూ థియేటర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు వెంటనే అమలు చేయాలంటూ ఓ మెమో ఇష్యూ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. దీంతో అభిమానులు, కామన్ ఆడియన్స్ ఓజీ చిత్రాన్ని ఇక సాధారణ టికెట్ ధరకే చూసే అవకాశం లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు