నీకు నాకు డాష్ డాష్ చిత్రం కోసం iOS అప్లికేషను

నీకు నాకు డాష్ డాష్ చిత్రం కోసం iOS అప్లికేషను

Published on Mar 31, 2012 8:33 PM IST


తేజ రాబోతున్న చిత్రం “నీకు నాకు డాష్ డాష్” చిత్రం కోసం ప్రత్యేకంగా ఒక iOS అప్లికేషను చేశారు. ఈ మధ్య తెలుగు చిత్ర దర్శకులు ప్రచారం కోసం విభిన్న పద్దతులను ఎంచుకుంటున్నారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం దక్ష అనే ఒక అమెరికా కంపెనీ ఈ చిత్రానికి ఇంటర్నెట్ ప్రచారం చేయ్యనుంది.ఈ ప్రచారంలో భాగంగా ఈ కంపెనీ iOS అప్లికేషనుని విడుదల చేసింది. ఈ అప్లికేషను ఎన్ ఆర్ ఐ లను అద్బుతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్ర బృందం ఇప్పటికే ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో ప్రచారం మొదలు పెట్టారు. సోషల్ నెట్ వర్కింగ్ లో వీరు నిర్వహిస్తున్న పోటీలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రిన్సు మరియు నందిత ప్రధాన పాత్రలు పోషించారు. మద్యం మాఫియాలో జరిగే ప్రేమకథా నేఫధ్యంగా సాగే ప్రేమ కథ ఈ చిత్రం. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు యశ్వంత్ నాగ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానుంది.

తాజా వార్తలు