ముగింపు దశలో ఉన్న తేజ 1000 అబద్దాలు

ముగింపు దశలో ఉన్న తేజ 1000 అబద్దాలు

Published on May 12, 2013 10:00 AM IST

1000-abaddalu-movie-still
విభిన్న చిత్రాల దర్శకుడు తేజ డైరెక్షన్లో త్వరలో మనముందుకు రానున్న చిత్రం ‘1000 అబద్దాలు’. ఈ రొమాంటిక్ ఎంటర్టైనింగ్ సినిమాలో సాయిరాం శంకర్, ఎస్తర్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం హీరో హీరోయిన్స్ పై ఓ పాటని హైదరాబాద్లో షూట్ చేస్తున్నారు. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ సినిమా గురించి తేజ మాట్లాడుతూ ‘ ఒక జంట మధ్య 100 అబద్దాలు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అనేదే ఈ సినిమా. ఇది పూర్తి ఎంటర్టైనింగ్ సినిమా. ప్రస్తుతం షూట్ చేస్తున్న పాటకి విద్యాసాగర్ డాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. రమణ గోగుల మంచి సంగీతాన్ని అందించాడని’ అన్నాడు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా ఆడియోని వచ్చే వారం విడుదల చేసి త్వరలోనే సినిమాని కూడా రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు