బుక్ మై షోలో “మిరాయ్” సెన్సేషన్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా రితికా నాయక్ హీరోయిన్ గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “మిరాయ్” కూడా ఒకటి. ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా నటించాడు. ఇక ఈ సినిమా అనుకున్న అంచనాలు అందుకొని అదరగొట్టింది.

ఇలా మొన్న వీకెండ్ సహా ఇపుడు వీకెండ్ లో కూడా సాలిడ్ బుకింగ్స్ అందుకున్న ఈ సినిమా మొత్తంగా బుక్ మై షోలో భారీ బుకింగ్స్ తో దుమ్ము లేపినట్టు మేకర్స్ చెబుతున్నారు. ఇప్పుడు వరకు మిరాయ్ చిత్రానికి ఒక్క బుక్ మై షోలోనే 1.75 ఎం,మిలియన్ టికెట్ సేల్స్ ని ఇందులో చేసుకున్నట్టు తెలిపారు.

దీనితో మిరాయ్ కి ఆడియెన్స్ ని మంచి ఆదరణ దక్కింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు అతి తక్కువ బడ్జెట్ లో అత్యున్నత ప్రమాణాలతో సినిమాని నిర్మాణం వహించారు.

Exit mobile version