దర్శకుడు తరుణ్ భాస్కర్ క్లాప్‌తో చాందినీ చౌదరి, సుశాంత్ యాష్కీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం ఘనంగా ప్రారంభమైంది. వికాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ జానర్ చిత్రాన్ని సహచారి క్రియేషన్స్ బ్యానర్‌పై సృజన గోపాల్ నిర్మిస్తున్నారు.
ఈరోజు జరిగిన ముహూర్తపు కార్యక్రమానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై, తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. లాంచింగ్ ఈవెంట్ లో గీతా భాస్కర్, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, ఈ సినిమా కాన్సెప్ట్ చాలా యూనిక్‌గా ఉందని, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాత సృజన గోపాల్ మాట్లాడుతూ, ఈ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు ఒక కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేయబోతున్నామని తెలిపారు. సైన్స్ ఫిక్షన్, డార్క్ కామెడీతో పాటు సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని, ప్రేక్షకులు ఊహించని ఒక సూపర్ హీరోని పరిచయం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో జీవన్ కుమార్, అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తుండగా, జితిన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవంబర్ చివరిలో హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే చిత్ర కాన్సెప్ట్ వీడియోను విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది.



