జనవరి 16న రానున్న తరుణ్ – యామిల యుద్ధం

yuddham

హీరో తరుణ్ చాలా కాలం తర్వాత మళ్ళీ ఓ సినిమాతో తెరపై కనిపించనున్నాడు. తరుణ్, యామి గౌతం జంటగా నటించిన సినిమా ‘యుద్ధం’. ఈ సినిమా జనవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే స్వర్గస్తులైన శ్రీహరి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు.

భారతి గణేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని నట్టి కుమార్ – నట్టి లక్ష్మి కలిసి ఈ సినిమాని నిర్మించారు. చాలా సంవత్సరాల నుంచి తరుణ్ కి హిట్ సినిమా లేదు. దాంతో తరుణ్ ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందని ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకి సంబందించిన లోగోని ఇటీవలే ఆవిష్కరించారు. ఈ సినిమా ఆడియో జనవరి 11న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Exit mobile version