ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా తారకరత్న

ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా తారకరత్న

Published on Jul 28, 2013 12:24 AM IST

Taraka Ratna (5)
తారకరత్న ఈ మధ్య వరుసగా సినిమాలను అంగీకరిస్తున్నాడు. అందులో కొన్ని సినిమాలు ప్రొడక్షన్ దశలో వున్నాయి. ‘యామిని చంద్రశేఖర్’ అనే సినిమాలో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా కనిపించనున్నాడు. ‘ఆకాశమే హద్దు’, ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ సినిమాలో నటించిన పాంచి బొరా ఈ సినిమాలో హీరోయిన్ . ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాను తీసిన రమణ సాల్వ ఈ చిత్ర దర్శకుడు. అంకమ్మ రావు నిర్మాత. అనూప్ తేజ్, నాజర్, సుమన్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.

ఈ సినిమా ఒక లవ్ స్టొరీ మరియు సైంటిఫిక్ థ్రిల్లర్ గాతెరకెక్కుతుంది. తారకరత్న పాత్ర ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని దర్శకుడు తెలిపాడు. ఈ సినిమా మొదటి కాపీ సిద్ధమైంది. చాలా భాగం చిత్రీకరణ హైదరాబాద్, వైజాగ్ మరియు అరకు ప్రాంతాలలో జరుపుకుంది. యోగేశ్వర శర్మ మరియు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించారు

తాజా వార్తలు